మాక్లూర్, బతుకమ్మ : మాక్లుర్ మండలంలోని మధ్యాహ్న భోజన పథక కార్మికులు సమావేశం నిర్వహించారు. దసరాకు చెల్లిస్తామన్న మధ్యాహ్న కార్మికుల బిల్లును ఇప్పటివరకు చెల్లించకుండా దసరా పండుగను పస్తులు ఉండేటట్లు చేసిందని ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి ఉన్నారు. గ్రీన్ ఛానల్ గురించి ప్రభుత్వం ప్రకటించిన జాడ లేదు ఈనెల 10వ తారీఖు వరకు డబ్బులు రాకుంటే 13వ తారీకు నుంచి పూర్తిస్థాయిలో మధ్యాహ్న భోజన పథకం నిలిపివేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. 10వ తారీఖు వరకు పెండింగ్ బిల్లును చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు అమలు కాలేదన్నారు. జిల్లాకు సుమారు ఇప్పటివరకు 10 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని లేదా ఒక పిల్లవానికి 25 రూపాయలు స్లాబ్ రేటు ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 13వ తారీకు నుంచి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సాయమ్మ, లక్ష్మి, ప్రమీల, విజయ, మండల బాధ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
