24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నగరంలోని అన్ని  డివిజన్ ల అభివృద్ధికి కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

. . . నూడా చైర్మన్ కేశ వేణు

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

గత  ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయిందని నిజామాబాద్ అర్బన్ డేవలప్మెంట్ ఆథార్టి చైర్మెన్ కేశ వేణు అన్నారు. 7 వ డివిజన్ కు చెందిన రామర్తి గోపి , 8వ  డివిజన్ కు చెందిన రమేష్ ల అధ్వర్యంలో స్థానిక  ప్రజల ఆహ్వానం మేరకు నుడా చైర్మెన్ కేశ వేణు అదివారం రోటరీ నగర్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ నగర్ ప్రజలు పలు సమస్యలను కేశవేణు దృష్టికి తీసుకురావడం జరిగింది.  ఈసందర్బంగా కేశ వేణు మాట్లాడుతు… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 7,8వ డివిజన్ తో పాటు అన్ని డివిజన్లలో లోని అన్ని సమస్యలను పరిష్కరించి డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇందుకోసం సమస్యలను పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి డివిజన్లలో మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీల నిర్మాణం బీటీ రోడ్లు సిసి రోడ్లు విద్యుత్ దీపాలతో పాటు డివిజన్లో అవసరమైన చోట పార్కులను కూడా నిర్మిస్తామని ఆయన అన్నారు. నూడా చైర్మన్ గా తాను కూడా ప్రత్యేక నిధులతో డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక నుండి ప్రతి నగరంలోని ప్రతి డివిజన్ ను సందర్శించి డివిజన్ లోని ప్రతి సమస్య పరిష్కారానికి నూడా చైర్మన్ గా ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఆయన ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మర్తి గోపి కాలనీ సభ్యులు బంటు రామ్ కుమార్, వెంకటేశ్వర్ చారి,నరసింహ స్వామి, స్వామి గౌడ్, సతీష్ ,హనుమాన్లు ,దత్తు , సుభాష్ చారి, సుదర్శన్, రూప్ సింగ్  కమిటీ సభ్యులు  ఉన్నారు.

Will work for the development of all the divisions of the city

 

 

More articles

Latest article