27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
  • బిచ్కుందలో తీవ్ర విషాదం

 

బిచ్కుంద, బతుకమ్మ : నిండు గర్భణి అయిన భార్యను పుట్టింటి నుంచి బైక్ పై తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24 గంటల్లోనే భార్యభర్తలు మృతి చెందడంతో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో విషాదం నెలకొంది. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మంగళి సునీల్ కు అదే మండలం పెద్దతడుగు గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది వివాహం జరిగింది. జ్యోతి ఐదు నెలల గర్బిణి కావడంతో ఈ నెల 14న పుట్టింట్లో సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 23న సునీల్ తన బైక్ పై భార్యను తడుగురు నుంచి బిచ్కుంద వస్తుండగా పెద్దమైసమ్మ గుడి వద్ద బైక్ స్కిడ్ అయి జ్యోతి కిందపడి మరణించింది. ఈ నేపథ్యంలో జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసుకుని బిచ్కుందకు డెడ్ బాడిని తీసుకురాగానే సునీల్ తన ఇంట్లో యాసిడ్ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.

Wife dies in road accident

More articles

Latest article