. . . సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య
. . . ఇరాన్ పై అమెరికా దాడిని ఖండిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మ దాహనం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రపంచ దేశాలపై, ప్రజలపై దాడి చేసే హక్కు అమెరికా సామ్రాజ్య వాదానికి ఎవరిచ్చారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ప్రశ్నించారు. ఇరాన్ దేశంపై అమెరికా ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ ఆదివారం నిజామాబాద్ నగరంలో గాయత్రి నగర్ చౌరస్తాలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా దాని తొత్తు ఇజ్రాయెల్ ఇటీవల పశ్చిమ ఆసియా పై తమ దాడులను తీవ్రంగా కొనసాగిస్తున్నదని, దీని పరాకాష్టయే నేడు కొనసాగిస్తున్న ఇరాన్ పై దాడి అని, అక్రమంగా దాడులు, చంపడాలు వీరు చెప్పే ఉగ్రవాదుల దాడుల కంటే ఇవి లక్షలరెట్లు మిన్న అన్నారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం ఆ దేశ వనరుల కోసం దాడులు చేస్తున్నారని, ఇప్పటికే వెనీజుల అధ్యక్షుడిని అమెరికా కిడ్నాస్ చేసిందని, ఆ దేశ ఆయిల్ ని తను కంట్రోల్ కి తెచ్చుకున్నదన్నారు. ఇప్పుడు ఇరాన్ పై పడిందనీ, అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ ఫై దాడిని ఉపసంహరించుకోవాలనీ, మోడీ ప్రపంచ శాంతి కోసం ఈ యుద్ధోన్మాద చర్యను ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, న్యూడెమోక్రసీ నాయకులు జేపీ గంగాధర్, శివకుమార్, ఆకుల అరుణ, వేల్పూరు లక్ష్మీ, నీలం లక్ష్మి, సంజన, పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పి డి ఎస్ యూ నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, జి సంజన, పిడిఎస్ యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, రమేష్, దాసు, మల్లేష్, శంకర్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
