26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం బారీకేడ్ల పంపిణీ అభినందనీయం

Must read

📰 Generate e-Paper Clip

  • ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రాఫిక్ నియంత్రణ కోసం ఖలీల్ వాడి లో నూతనంగా త్వరలో ప్రారంభం కానున్న వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం ఎం.డి లు తాళ్ల సుమన్ గౌడ్ ,అసద్ ఖాన్ ,వివేకానంద రెడ్డి ల ఆధ్వర్యములో దాదాపు 100 కి పైగా బారికెళ్లను ఉచితంగా ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి  మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అదేవిధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన అన్నారు. ఇందుకోసం వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం ఇలా ట్రాఫిక్ లను అదుపులోకి తీసుకువచ్చే విధంగా బారికేడ్లను ట్రాఫిక్ పోలీసులకు అందించడం శుభ పరిణామామని అన్నారు.ఆసుపత్రి ఆవరణలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు అంతస్తుల్లో సెల్లార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏసీపీ అన్నారు. వెల్నెస్ ఆస్పత్రి వారు అందించిన ఈ భారీ కేడ్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఖలీల్ వాడి లోని ముఖ్యమైన రద్దీ ప్రాంతాల్లో వీటిని వినియోగించుకుంటామని తెలిపారు. ఆస్పత్రి బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి త్వరలో ప్రారంభం కన్ను నేపథ్యంలో ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. దుమ్ము, ఎండ, వర్షాకాలంలో సైతం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎనలేని కృషి చేస్తారని అందుకే వారి ఆరోగ్యం దృష్టిని ఆలోచించి ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ జిఎం హరికృష్ణ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది మన్నె రాజేష్ , వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Wellness Hospital management commends distribution of large cadres

More articles

Latest article