. . . ఎస్సై సాయన్న
రుద్రూర్, బతుకమ్మ :
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనలు డ్రైవింగ్ చేసేవారు సిట్ బెల్ట్ ధరించాలని ఎస్సై సాయన్న పేర్కొన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రుద్రూర్ బస్టాండ్ వద్ద ప్రజలకు రోడ్డు భద్రత నియమలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. మద్యం సేవించి అతివేగంతో వాహనాలు నడుపరదని, దాని వల్ల జరిగే దుష్పరిమనలను వివరించారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. సురక్షిత ప్రయాణం కుటుంబ సభ్యులకు ఎంతో క్షేమదయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
