28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధితులకు అండగా ఉంటాం

Must read

📰 Generate e-Paper Clip

  • డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

 

వర్ని, బతుకమ్మ : గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా  బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల పరిధిలోని చింతలపేట తండా, సిద్ధాపూర్, పులి క్యాంప్, జలాల్ పూర్, గ్రామాలలో దెబ్బ తిన్న రహదారులను, కల్వర్టులను, వరద నీరు ఇళ్లలోకి చేరడంతో బాధితుల ఇళ్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు.  పులి క్యాంప్ లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో బాధితుల ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.  పెద్దగుట్ట –  వర్ని రహదారి జలాల్ పూర్ వద్ద దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు.  సిద్ధాపూర్ గ్రామంలో గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు నిర్మాణంలో ఉన్న సిద్దాపూర్ రిజర్వాయర్ ఆనకట్టను పరిశీలించి అనంతరం భారీ వర్షానికి పూర్తిగా కూలిపోయిన ఇండ్లను పరిశీలించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.  చింతల్ పేట్ తండా రోడ్డుపై వరద నీటి ఉధృతికి దెబ్బతిన్న  కల్వర్టును పరిశీలించారు.

We will stand by the victims

More articles

Latest article