సీఎం రేవంత్ రెడ్డి
వెబ్ న్యూస్, బతుకమ్మ : రాష్ట్రానికి నిధుల విషయమై అవసరమైతే డిల్లీ ధర్నాచేయడానికి సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎల్పీలో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్ఎస్ చూస్తోందని సీఎం ఆరోపించారు. రాష్ట్రా భివృద్ధి కి కేంద్ర నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలని సీఎం సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి తో చర్చకు తాను, భట్టి విక్రమార్క వస్తామని పేర్కొన్నారు. కేంద్రం అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్ రెడ్డిని సన్మానిస్తామని తెలిపారు.
