. . . తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్
ఆర్మూర్, బతుకమ్మ :
కాంటాక్ట్ లెక్చర్లను పర్మనెంట్ చేయడంపై హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులు, పట్టభద్రులు అసంతృప్తికి లోనయ్యారని గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని ఇది సరైన విధానం కాదని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పైన నిరుద్యోగులు, పట్టబదులు ఉన్నారని ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి రిటర్న్ టెస్టు, మెరిట్ లిస్టు, రోస్టర్ స్కేల్ ప్రకారము ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ ప్రభుత్వ జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్ లను, డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల ను ఏ విధమైనటువంటి పరీక్షలు గానీ విధివిధానాలు కానీ అవలంభించకుండా హైకోర్టు రెగ్యులర్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, నిరుద్యోగుల కోసం, పట్టభద్రుల కోసం ఎంత దూరమైనా వెళ్దామని వారికి న్యాయం జరిగే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలను కాకుండా ప్రభుత్వ కార్యాలయంలో చాలామంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని వారిని కూడా పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గెస్ట్ లెక్చరర్లు , గెస్ట్ టీచర్ ,పార్ట్ టైం లెక్చరర్లు, పార్ట్ టైం టీచర్లను కూడా పరిగణలోకి తీసుకొని వారి శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
