- కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యల సునీల్ కుమార్
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణాభివృద్దిని భాద్యతగా తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన సమక్షంలో పట్టణానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా పాలనలో అభివృద్ధిని చూసి కాంగ్రెస్ లో చేరుతున్న కార్యకర్తలకు పార్టీ కండ్వాను కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు భీమ్ గల్ పట్టణ కేంద్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపి సుందరీకరణ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని ఆయన అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో భీమ్ గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోక అన్యాయానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ లోటును పూడుస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే వివిధ గ్రాంట్ ల ద్వారా రూ.54 కోట్ల నిధులను అభివృద్ధి కొరకు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. మున్సి పాలిటి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం పీ పీ కన్నే సురేందర్, భీమ్ గల్ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జేజే నర్సయ్య, మల్లెల లక్ష్మణ్, పర్స సుధాకర్, మారి పెద్ద లింగం నల్లూరి శ్రీనివాస్, సతీష్,దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.