27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వివేకానంద ఆశయాలను కొనసాగిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్అ న్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గాజుల్ పేట్ లోని వివేకానంద విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ యువతకు స్వామి వివేకానంద సూక్తులు ఎంతో అవసరమని, వారు చూపెట్టిన మార్గంలో నడిస్తే యువత విజయాలు సాధిస్తారన్నారు. ప్రభుత్వాలు యువతకు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, కరిపే రవింధర్, తోట రాజశేఖర్, కోడూరు స్వామి, విజయ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article