. . . బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, బతుకమ్మ:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనను స్వాగతిస్తూ అదే విధంగా కేంద్రం బీసీ కులగణన కు సుముఖత వ్యక్తం చేయడాన్ని కూడా స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లో బీసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గోన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బీసీలకు అనుకూలించే అంశాలు ,బీసీ ల తక్షణ కర్తవ్యం పై చర్చించామన్నారు. కేంద్రం వెంటనే 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలు కూడా 42 శాతం రిజర్వేషన్ల అనుమతి తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, కరిపె రవిందర్, మాడ వేడి వినోద్, కొయ్యాడ శంకర్, శ్రీలత, చంద్రమోహన్, చంద్రకాంత్, బగ్గలి అజయ్, రమణ స్వామి, రవి, సతీష్, భూమన్న తదితరులు పాల్గొన్నారు
