కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు
కామారెడ్డి, బతుకమ్మ : ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అసహనానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఒకరెమో రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని, మీ నానమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడుతున్నారని, ఇంకొకరేమో రాహుల్ గాంధీ గారి నాలుక కోస్తే 11 లక్షల బహుమానం ఇస్తామంటారని అన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, ప్రధాన మంత్రి మోడీ కానీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కానీ ఈ విషయంలో కనీసం స్పందించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల ఆగ్రహానికి గురికాకముందే బిజెపి ప్రభుత్వం వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవలన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బిజెపిపై నిరసన వ్యక్తం చేస్తూ వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. రేపటినుండి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలన్నారు. రాహుల్ గాంధీ పై బీజేపీ నేతలు వరసగా చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజాస్వామ్య వాదుల మద్దతుతో నిరసన కార్యక్రమాలు చేపడతాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, గుడుగుల శ్రీనివాస్, గోనెశ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, వలపుశెట్టి భాస్కర్, సర్వర్ కిరణ్, లక్కపత్తిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ పై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
