రాహుల్ గాంధీ పై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు కామారెడ్డి, బతుకమ్మ : ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అసహనానికి గురిచేస్తున్నాయని...