28.8 C
Hyderabad

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  ఇటీవల బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తండ్రి వేణు, కూతురు అపర్ణల కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బుధవారం పరామర్శించారు. నిజామాబాదు నగరంలో న్యాల్కల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితురాలు అనురాధ కుటుంబాన్ని కలిసి వారికి మనోదైర్యం చెప్పి అండగా ఉంటాం అని భవిష్యత్ లోకూడా విధాలా ఆదుకుంటాం అని అన్నారు.  ధన్ పాల్ లక్ష్మీ బాయ్ , విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ధ్వరా బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేశారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల వలన బాధితులు కుటుంబాలను చిన్న భిన్నం చేసుకోవద్దని ఏదైనా సమస్యలు ఉంటే పోలీస్ ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, 7వ కార్పొరేటర్ సుక్క మధు,బీజేపీ నాయకులు ప్రభాకర్,మల్లేష్ ఆనంద్, భాస్కర్,కొండా రఘు,ప్రతాప్, శ్రీనివాస్, అర్వపల్లి బాల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

We stand by the victim's family

More articles

Latest article