25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా సలహాదారులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మనమందరము డా.బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా సలహాదారులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగ నిర్మాత అని, భారత తొలి న్యాయశాఖ మంత్రిగా అనేక సేవలందించారన్నారు. పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, సమాన అవకాశాల కోసం, అంటరానితనం  నిర్మూలించడానికి, సామాజిక న్యాయాన్ని నిర్ధారించడానికి నిబంధనలను ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం అనంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

We should follow in Ambedkar's footsteps.

More articles

Latest article