. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అంతరాలు లేని సమాజం కోసం, మత విద్వేషాలను ఎదిరించటం కొరకు ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. శుక్రవారం మేడే ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఉదయం మేడే జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం మే డే అని కుల, మత, ప్రాంత, జాతి, వివక్షత, విభేదాలు లేకుండా కష్టజీవులందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడటానికి ప్రతిజ్ఞ దినంగా మేడను నిర్వహించుకుంటారన్నారు. ప్రధానంగా దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాశి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, ఫలితంగా కార్మికులు యాజమాన్యాలకు కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చి శ్రమదోపిడికి పూనుకున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించకుండా రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, నిత్యవసర సరుకుల ధరలను అదుపు చేయకుండా, పెట్టుబడిదారులకు లాభాలు పరమావధిగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో కష్టజీవులు అందరూ శ్రమకు తగ్గ ఫలితం కోసం పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, సురేష్ నగర నాయకులు నల్వాల నరసయ్య, అనిత అనసూయమ్మ, అంజయ్య, శంషాద్దీన్, ఇమామ్, తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

