25.6 C
Hyderabad

విద్యార్థులకు బంగారు బాట చూపాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాట చూపే విధంగా అధ్యాపకులు బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అధ్యక్షతన అధ్యాపకులకు రెండు రోజుల ఓరియంటేషన్ తరగతులను ప్రారంభించారు.

 

We must show students a golden path.

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేయాలని అన్నారు. తెలుగు, హిందీ, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ లలో జరుగుతున్న శిక్షణ తరగతులకు జిల్లాలోని పలు ప్రాంతాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినం సందర్భంగా విద్య అధికారి, కళాశాల ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్, పలువురు అధ్యాపకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

We must show students a golden path.

More articles

Latest article