29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మాదిగల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గ్రామగ్రామాన ఎంఆర్పీఎస్ జెండా గద్దెల నిర్మాణం చేపట్టాలి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మాదిగల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 40 రోజుల కార్యాచరణ గురించి చర్చించారు. అలాగే జూలై 7 న జరిగే ఎంఆర్పీఎస్ 32 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని తెలియజేశారు. అనంతరం జిల్లాలోని ప్రతి మండలానికి ఇంచార్జీలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 40 రోజులలో ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో జెండా గద్దెల నిర్మాణం జరగాలన్నారు. వర్గీకరణ వల్ల అందే ఫలాలను సద్వినియోగం చేసేలా మాదిగ విద్యార్థులను చైతన్యం చేసే బాధ్యత ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకుల మీద ఉందని తెలియచేశారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మైలారం బాలు మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేణిగుంట నాంపల్లి మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసింగారి భూమయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి చెవురి శ్యామ్ మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు సుధ మాదిగ, ఎంఆర్పీఎస్ నందిపేట మండల అధ్యక్షులు పైడకుల ప్రశాంత్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article