27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

న్యాయం కోసం పాటుపడే వారిని గెలిపించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరి లో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో  గెలిపించుకోవాలని జిల్లా బార్ అసోసియేషన్ లో బార్ అధ్యక్షులు మామిళ్ళ సాయి రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కి వచ్చిన రాపోలు భాస్కర్, జిల్లా బార్ అసోసియేషన్ లో బార్ అధ్యక్షులు మామిళ్ళ సాయి రెడ్డి, న్యాయవాదులను కలిసి  మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా ఒకే బార్ కౌన్సిల్ కొనసాగుతుందని అన్నారు. ఇప్పుడు జనవరి 30న జరిగే  ఎన్నికల్లో తాను ఫోటి చేస్తున్నానని తనకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో గత కొంతకాలంగా న్యాయవాదుల పై జరుగుతున్న హఠాలు, అక్రమాలు దాడులు అరికట్టుటకు అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ బిల్ ఎంతో అవసరం అని అన్నారు. దాని అమలు కొరకు తాను కృషి చేస్తానని జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ పెంచుటకొరకు వారి ప్రాక్టీస్ కృషి కి పుస్తకాల పంపిణి తదితర ముఖ్య విషయాల పట్ల తాను ముందంజ ఉంటానని అన్నారు. ఈ కార్య క్రమం లో  బార్ కార్యదర్శి మాణిక్ రాజు, వైస్ ప్రసిడెంట్ సురేష్, జాయింట్ సెక్రటరీ ఝాన్సీ రాణి, మంజిత్ సింగ్, పీ పీ రాజేశ్వర్, జీపీ ఆముదాల సుదర్శన్ సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

More articles

Latest article