26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95 వ వర్ధంతి సభలను విజయవంతం చేయండి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశంలో యువత ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాటస్ఫూర్తితో పోరాడాలని పీడీఎస్ యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని నాందేవ్ వాడ ఎస్సీ హాస్టల్ లో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి 30 వరకు జరిగే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, ఆయన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నాయకులు మనోజ్, ప్రసాద్, రాజేష్, వంశీ, సాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article