. . . ప్రభుత్వానికి బిల్డర్ అసోసియేషన్ వినతి
. . . ఈ నెల 18న బిల్డర్ అసోసియేషన్ చలో హైదరబాద్ కు పిలుపు
నిజామాబాద్ , బతుకమ్మ:
ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్ లు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.. ప్రభుత్వ పనుల కోసం చేసిన అప్పులు తడిసి మోపెడు అవుతున్నాయి. వడ్డీ చెల్లించలేని పరిస్థితి లో ఉన్నాం… మేం ప్రభుత్వాన్ని అప్పులు అడగడం లేదు… మెం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇవ్వండి అని బిల్డర్ అసోసియేషన్ ఆప్ ఇండియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఛలో హైదరాబాద్ మహా సభ పోస్టర్ ఆవిష్కరించిన బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని .. దేశం, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలు బాగుండాలి అని తెలిపారు. బిల్డర్ల పెండింగ్ బిల్లులు చెల్లించండి అని కోరారు. మా కుటుంబాలు రోడ్లపై పడ్డాయనే చలో హైదరాబాద్ సమావేశం నిర్వహిస్తున్నాం .. చలో హైదరాబాద్ సందర్భంగా ఈనెల 18న కార్యాచరణ ప్రకటిస్తాం అని అన్నారు. కాంట్రాక్టర్లు మనో వేదన తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మా సమస్యల పై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు అన్నారు. రాష్ట్రంలో 25వేల కోట్లు బకాయిలు ఉంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రూ.300 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేమి ఉండగా పాత పనుల బకాయిలు చెల్లించకుండా కొత్త టెండర్లను పిలవడం సరికాదన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పెండింగ్ బిల్లులు విషయంపై స్పష్టమైన వైఖరి తెలుపాలని లేకపోతే 18న జరిగే మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు…
