కేసీఆర్, హరీష్ లను దోషులుగా నిలబెట్టబోతున్నాం

0 14,546
  • ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో బట్టబయలు చేస్తాం
  • రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ  : వందేళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టు లక్ష కోట్లతో నిర్మిస్తే మూడేళ్ళకే కూలీనా బీఆర్ఎస్ తప్పు చేయలేదని బీరలకు పోతుందని రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం‌ ప్రాజెక్టు అతి పెద్ద స్కాండల్ అని, సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నిర్వీర్యం అయిందన్నారు. కాలేశ్వరం‌ అవినీతిపై ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడుతామన్నారు. కేసీఅర్, హరీష్ దోషులుగా తేలారని, అసెంబ్లీ వేదికగా వారిద్దరిని దోషులుగా నిలబెట్టబోతున్నామన్నారు. ఘోష్ కమిటీని వ్యతికేరిస్తున్న కేసీఆర్ నివేదిక వచ్చాక నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించడం చూస్తే బీఅరెస్ తప్పు చేసినట్టు అర్థమవుతుందన్నారు. 42 శాతం బీసీలకు  రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టామని, ఢిల్లీలో కూడా ధర్నా చేశామని, బీఅర్ఎస్ అసెంబ్లీలో మద్దతిచ్చి పార్లమెంటులో మద్దతు ఇవ్వడం లేదన్నారు. బీఅర్ఎస్ కు రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ది లేదన్నారు. కొత్తగా రిజర్వేషన్లలో ఎవరినీ యాడ్ చేయలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు బీసీల్లో ఉన్నారని, ఈ వంక తో రిజర్వేషన్‌లు అడ్డుకుంటున్న బీజేపీ వారు పాలించే రాష్ట్రాల్లో ముస్లింలను తొలగించి చూడాలని సవాల్ విసిరారు. వందేళ్ళలో లేనంత వరద వచ్చిందని, రూరల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను వరద ముంచెత్తిందన్నారు. ప్రాణనష్టం జరగకున్నా ఆస్థి నష్టం జరిగిందని, వరదలపై ఎప్పటికప్పుడు స్పందించి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నామన్నారు. వరదల వల్ల జరిగిన నష్టం విషయమై నివేదికలు తెప్పిస్తున్నామని, ప్రభుత్వం అన్ని విధాలా వరద బాదితులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

We are going to make KCR and Harish guilty

Leave A Reply

Your email address will not be published.