బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం హస్నాపూర్, నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ గ్రామాలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు మంజూరైన పథకాల ఉత్తర్వులు అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సంక్షేమ పథకాలు ప్రారంభించి పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్ర పటానికి సుల్తాన్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
