24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా భారతీయ సంవిధాన్ విజయోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారతీయ సంవిధాన్ విజయోత్సవ్ ఉత్సవాలను భారత రాజ్యాంగం అమలు అయ్యి 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నిజామాబాద్ పట్టణంలోని ఐదవ డివిజన్ బోర్గం(పి) లో పాత గ్రామపంచాయతీ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద సంవిధాన్ విజయోత్సవ్ ఉత్సవాలను భారతీయ సంవిధానం ప్రచారక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రచారక్ ధళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం అయ్యి 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటా రాజ్యాంగం గుండె గుండెకు రాజ్యాంగం అని నినాదాలు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ సంవిధాన్ విజయోత్సవ ఉత్సవాలను నిరంతరం జరపాలని పేర్కొన్నారు.  స్వాతంత్రం వచ్చినప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. రాజ్యాంగ సభ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని నియమిస్తూ దాదాపు రెండు సంవత్సరాల 11నెలల 11 రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాసి 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ యందు సమర్పించారు. తద్వారా జనవరి ఒకటి 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తమ హక్కులను వినియోగించుకుంటున్నారని అలాగే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కాలనీ లీడర్లు గుండు బ్రహ్మయ్య, బట్టు కమల, అజినీ నాగమణి ,పండరి, సురేష్, ప్రతాప్, చిట్టి కృష్ణవేణి, గంగవ్వ, సావిత్రి, సరస్వతి, సాయి, దుర్గాప్రసాద్, తులసి, లక్ష్మి నవనాథ్ గోబిశెట్టి అనిత దశరథం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Great celebrations of Bharatiya Samvidhan

More articles

Latest article