- లబాన లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్
కామారెడ్డి, బతుకమ్మ : లబాన లంబాడీలను మధుర లంబాడీల జాబితా నుండి తొలగించి లబానా జాతిగా గుర్తింపు ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తున్నాం అని లబాన లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని 9 నియోజక వర్గాల్లో లభనాలు లంబాడీలు ఉన్నారని తెలిపారు. బీసీ కుల గణనలో లబాన లంబాడీలకు భాష, బీసీ కుల జాబితాలో గుర్తింపు ఇచ్చిన తర్వాత బీసీ కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని మతూర కులం నుండి లాభన కులంగా ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది లభాన లంబాడీలు ఉన్నారని అన్నారు. తమకు బీసీ జాబితాలో గుర్తింపు ఇచ్చే వరకు బీసీ కుల గణనను బహిష్కరిస్తున్నాం అని అన్నారు. ఈ నెల 26 లోపల లాబాణ భాషను, కులము అప్షన్ గా చూపించి కుల గణన చేయాలని అన్నారు. గ్రామాలలోకి వస్తున్న అధికారులకు ఆప్షన్ వచ్చేవరకు సర్వేలో పాల్గొనమని తెలిపారు.
