రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తున్నాం
లబాన లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ కామారెడ్డి, బతుకమ్మ : లబాన లంబాడీలను మధుర లంబాడీల జాబితా నుండి తొలగించి లబానా జాతిగా గుర్తింపు ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తున్నాం అని లబాన లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని 9 నియోజక వర్గాల్లో లభనాలు లంబాడీలు ఉన్నారని తెలిపారు. బీసీ కుల గణనలో లబాన లంబాడీలకు భాష, బీసీ కుల జాబితాలో...