మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది

0 8,242

 

. . . శివాజీ మహారాజ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ శివాజీ పాటిల్

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం కాషాయ ధ్వజాన్ని ఎగురవేసేవారని, ఆ సంప్రదాయాన్ని స్మరించుకుంటూ, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శివాజీ మహారాజ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ శివాజీ పాటిల్ అన్నారు. నగర శివారులోని సారంగాపూర్ హనుమాన్ దేవాలయ పరిసరాల్లోని, సమర్థ రామదాసు చౌరస్తాలో చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో కాషాయ ధ్వజావిష్కరణ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సమర్థ రామదాసుతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ కలిసున్న విగ్రహం వద్ద ఉగాది పండగ సందర్భంగా వరుసగా రెండో ఏడాది కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ ఆలయ ప్రధాన అర్చకులు శశి మహారాజ్, నాగభూషణ్ గురుస్వామి, కార్పొరేటర్ బంటు రాము హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజావిష్కరణ చేస్తూ, హైందవ ధర్మాన్ని, అందులోని ఆధ్యాత్మిక స్ఫూర్తిని లోకానికి చాటారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఉగాది పచ్చడి విశిష్టతను వివరిస్తూ మన ఆచార వ్యవహారాలను భావి తరాలకు అందించాలని కోరారు. తెలుగు నూతన సంవత్సరంగా భావించే ఉగాది పర్వదినాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని కోరారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురోగ్యాలతో, ధన లాభాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, బబురు, విజయ్, నాగరాజు, నగేష్, రాజు, ప్రదీప్, సాయి, సాయి రాములు, నితిన్, కార్తీక్, సంజయ్, బాబు, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, నరసింహులు, గోవింద్ మహారాజ్, హనుమాన్ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

 

We all have a responsibility to preserve our culture.

Leave A Reply

Your email address will not be published.