29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కేంద్ర హోం మంత్రి మధ్యాహ్నం 2.15 గంటలకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్)కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అమిత్ షాకు బొకేలు అంధించి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షా వెంట హెలికాప్టర్ లో నిజామాబాద్ కు విచ్చేయగా, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే   ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు కే.లక్ష్మణ్, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు అమిత్ షాకు సాదర స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్ లో కేంద్ర హోం మంత్రి వినాయక నగర్ చేరుకుని నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. అక్కడి నుండి కాన్వాయ్ ద్వారా బస్వా గార్డెన్ చేరుకుని, పసుపు బోర్డు ప్రారంభోత్సవ సమావేశంలో పాల్గొని పసుపు రైతులు, బోర్డు అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, పసుపు బోర్డు అధికారులు, రైతులు పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా పాల్గొన్న కార్యక్రమాలకు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

Warm welcome to Union Home Minister Amit Shah

More articles

Latest article