29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ పార్టీ నుంచి రావి శ్రీనివాస్ ఆరేళ్ల పాటు సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

ఆసిఫాబాద్, బతుకమ్మ : ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్ళ పాటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఎంపీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావి శ్రీనివాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై ఇచ్చిన ఫిర్యాదు ను కమిటీ పరిశీలించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

More articles

Latest article