24 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ లో చేరిన 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మండలంలోని 11 వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ రామగళ్ల లక్ష్మి శివానందం మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మెహన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయి బాబా, జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు విద్యాసాగర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ కి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ లో కొనసాగితే ప్రజలకు చేయగలిగేది ఏమి లేదని భావించి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ లో చేరానన్నారు. అధికారంలో ఉన్న పార్టీతో ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మండలం మున్సిపల్ పరిధిలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు, బీఆర్‌ఎస్ పార్టీకి ఒక సీటు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావించవచ్చు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డిపేట గ్రామస్తులు, 11వ వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Ward 11 BRS councilor joins Congress

More articles

Latest article