29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తె.యూ లో బుధవారం వాక్ – ఇన్ ఇంటర్వ్యూలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బ్రోచర్ ఆవిష్కరించిన వైస్ చాన్స్ లర్

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, ప్రముఖ ఔషధ సంస్థ హెటెరో డ్రగ్స్ సహకారంతో జూలై 15 న (ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు) నిర్వహించనున్న వాక్ – ఇన్ ఇంటర్వ్యూల బ్రోచర్‌ను తెలంగాణ యూనివర్సిటీ వైస్ – చాన్స్ లర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ – చాన్స్ లర్ మాట్లాడుతూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఇలాంటి క్యాంపస్ నియామక కార్యక్రమాలు విశ్వవిద్యాలయ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హెటెరో డ్రగ్స్, హైదరాబాద్ సంస్థ ప్రతినిధులు హాజరై అర్హులైన అభ్యర్థు లను ఎంపిక చేయనున్నారు. బీఎస్సీ, బీకాం, బీఏ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఐటీఐ, డిప్లొమా తదితర అర్హతలు కలిగిన 2024–2026 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని విభాగాధిపతి డాక్టర్.బి.సాయిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి డా.బి.సాయిలు, సీనియర్ ప్రొఫెసర్ డా.నాగరాజు పాల్గొన్నారు.

More articles

Latest article