29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నవోదయ పాఠశాలకు ఎంపికైన వివేకానంద స్కూల్ విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండల కేంద్రంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ లో గల జవహర్ నవోదయ పాఠశాలకు ఎంపిక అయినట్టు ప్రధానోపాధ్యాయులు కుర్మాన్ పల్లె చంద్రకాంత్ తెలిపారు. ఇందులో జుక్కల్ కు చెందిన ఆదిత్య, కె.సంకీర్తన తో పాటు గుండూర్ కు చెందిన బి.ఆర్యన్, పడంపల్లి కి చెందిన డబ్ల్యూ.ఆదిత్య ఉన్నట్టు ఆయన తెలిపారు. ఆరవ తరగతి నవోదయ ప్రవేశ పరీక్షలో తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుర్మన్ పల్లె చంద్రకాంత్ తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు. దీంతో పాటు గ్రామస్తులు సైతం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. చదువుల్లో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు.

More articles

Latest article