వెబ్ డెస్క్, బతుకమ్మ :
ప్రపంచంలోనే కాన్సర్ కు వ్యాక్సిన్ కనుగొన్న రష్యా ఆ వాక్సిన్ ని 19 ఏళ్ల భారత యువకుడికి అందజేయనున్నారు. లక్నోకు చెందిన 19 ఏళ్ల అన్షు శ్రీవాస్తవ భారతదేశంలో ఈ వ్యాక్సిన్ ట్రయల్‌లో పాల్గొననున్న మొదటి యువకుడిగా గుర్తింపు పొందబోతున్నాడు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అన్షుపై ఎంటరోమిక్స్ క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు రష్యా ప్రభుత్వం నుంచి సహాయం లభించనుంది. ఈ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఎ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చి, ట్యూమర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది.
