. . . ఏడి శ్రీనివాస్
ఇందల్వాయి, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూముల రీ సర్వే లో భాగంగా ఇందల్వాయి మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామపంచాయతీ లో భూభారతి భూముల రీ సర్వే గ్రామ సభలను గ్రామ సర్పంచ్ దర్శనం మోహన్ అధ్యక్షతనలో నిర్వహించారు. అనంతరం ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు గ్రామసభ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లాలోని 70 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు గ్రామాలుగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీనిలో మూడు గ్రామాలను ఎంపిక చేయగా మొదటి విడతగా మల్లాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని ప్రజలకు సూచించారు. రెండో విడతగా గౌరారం, మూడో విడతగా వెంగల్పాడు గ్రామాలలో రీ సర్వేలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటగా మల్లాపూర్ గ్రామం యొక్క విస్తీర్ణాన్ని డిజిటలైజేషన్ చేసి దాని తర్వాత కాలువలు, రోడ్లు, ప్రాజెక్టులు, వాటిని కూడా రీ సర్వే చేసి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. గతంలో 1920, 1930, సంవత్సరాలలో చైను గొలుసులతో భూములను కొలిచే వారన్నారు. ఇప్పుడు డిజిటలైజేషన్ సర్వేతో శాటిలైట్ ద్వారా గ్రామ సరిహద్దు ముఖ్య ప్రాధాన్యతగా గ్రామ కంటాలు అనగా ఇండ్లు స్కూల్ భవనాలు రోడ్లు వంటివి సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టాదారు పాసు బుక్కు ఉన్నవారు ఒక ఏరియాకు పది సర్వే నంబర్లు కేటాయించినట్లయితే ఆ పది నంబర్లు పూర్తయ్యే వరకు వాటిని డిజిటల్లైజేషన్ చేసి కొత్త సర్వే నంబర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక కుటుంబంలో నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లయితే ఇద్దరు కుమారులు ఉంటే ఇప్పుడే ఎవరిది వారు చేయించుకోవాలన్నారు. దీనికి నూతన భూదాద్ ద్వారా పట్టా నంబర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సర్వే చేసిన రైతులకు భూదార్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. భూభారతి రీ సర్వే చేసిన తర్వాత ఏమైనా తప్పులు ఉన్నట్లయితే 60 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 60 రోజులు దాటిన తర్వాత తమ పరిధిలో పరిష్కరించే అవకాశం లేదని తెలిపారు. ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నట్లయితే హైకోర్టును సంప్రదించాల్సి వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దర్శనం మోహన్, ఉప సర్పంచ్ కళావతి, పంచాయతీ కార్యదర్శి సుప్రియ, గ్రామ రైతులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

