బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణంలోని విద్య వికాస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. వివిధ గ్రూపుల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాల ప్రతిష్టను పెంచారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో ఎం.మారుతీ – 468, ఎం.సాత్విక – 467, ఓ.దివ్య శ్రీ – 466, ఆర్.పుండాలిక – 464, కె.శివాజీ – 464, బి.రామ్ చరణ – 464, వర్ణిక ప్రియా – 461, ఎం.శ్రావణి – 461 మార్కులు సాధించారు.

బైపీసీ మొదటి సంవత్సరంలో కె.కీర్తన – 437, సాలెహ భూషరా – 436, పి.లక్ష్మణ్ – 436, మహీన్ – 435 మార్కులు సాధించారు. సీఈసీ మొదటి సంవత్సరంలో మీఫరా ఫాతిమా – 488, శారీక కణం – 465 మార్కులు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో తాహూర తాంసీల్ – 994, అరీష సమీన – 992 మార్కులతో ప్రతిభ చాటారు.

ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో కే.సాత్విక – 990, ఎం.మహేశ్వరి – 985, ఎ.వసంత్ – 984, జాన్ వన్య – 984, ఎం.శ్రీకర్ – 982, ఎం.సోంనాథ్ – 980 మార్కులు సాధించారు.

ఎంఈసీ ద్వితీయ సంవత్సరంలో ఫైజా నూరిన్ – 931 మార్కులు, సీఈసీ ద్వితీయ సంవత్సరంలో కే.కుశల – 949 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

