25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

టాలీవుడ్ లో విషాదం

వెబ్ న్యూస్, బతుకమ్మ : టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్​లో ఫిలింనగర్ లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున  ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.  ఆయన మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జూలై 10న కోట జన్మించారు. బాల్యం నుంచే ఆయనకు నాటకాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1968లో రుక్మిణితో వివాహం జరగగా.. వారికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు జన్మించారు. కాగా.. 2010లో జరిగిన రోడ్డుప్రమాదంలో కోటా శ్రీనివాస్ కుమారుడైన ప్రసాద్ మరణించారు.

  తమ్మి నమస్తేనే డైలాగ్… సోషల్ మీడియాలో వైరల్ గా మీమ్స్…

కోట శ్రీనివాస రావు ఫేమస్ తమ్మి నమస్తేనే అరె మంచిగా గుర్తు పట్టినావు ఎట్లన్నవు మంచిగన్నవా ఏంటో వయ్య ఎప్పటికప్పుడు నీతో కలవాలని మంచిగా ఖుషి చేసుకోవాలని ఉంటది కానీ ఏం చేస్తాం.. ఉన్నా నువ్వు బీజీ.. నేను బీజీ..గసలు మన బతుకలే టెన్షల్ బతుకులున్నట్లు …కాగా  కోట చెప్పిన ఈడైలాగ్ తో  సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ గా మారాయి.

నివాళులు అర్పించిన ప్రముఖులు

కోట శ్రీనివాస రావు భౌతిక కాయాన్ని నటులు బ్రహ్మనందం, రాజేంద్ర ప్రసాద్ సందర్శించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా బ్రహ్మనందం కన్నీంటి పర్యంతమయ్యారు.

కోట మృతి సినీ రంగానికి తీరనిలోటు : ప్రముఖుల సంతాపం

కోట శ్రీనివాస రావు మృతి సినీ రంగానికి తీరని లోట అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైవిధ్య పాత్రల్లో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమని ఏపీ సీఎం చంద్ర బాబు అన్నారు. విలక్షణ నటుడిని కోల్పోయామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కోట ఇక లేరనే వార్త కలిచి వేసిందని నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్ అన్నారు. ఈసందర్భంగా వారు కోట మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

More articles

Latest article