తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు సమీపంలో..
వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు సమీపంలో డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకి మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై పోర్టు నుంచి బెంగళూరుకు 52 వ్యాగన్ల ద్వారా ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈగూడ్స్ రైలుకు ఆదివారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చెన్నై- అరక్కోణం మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో, ప్రయాణికుల రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించమని రైల్వే పోలీసులు వెల్లడించారు.
