24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేంధర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాలకు ఇద్ధరు మాత్రమే నామినేషన్ లు దాఖలు చేయడంతో ఆ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అబిషేక్ సంఘ్వీతో పాటు సీనియర్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు వేం నరేంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎంపికయ్యారు. సోమవారం రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అసెంబ్లీ లో రిటర్నింగ్ అధికారుల నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభలో తెలంగాణ గళం వినిపించి రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులకు, పార్టీ నాయకులకు వేం నరేంధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు హాజరయ్యారు.

Vem Narendhar Reddy elected unanimously to Rajya Sabha

 

More articles

Latest article