రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేంధర్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాలకు ఇద్ధరు మాత్రమే నామినేషన్ లు దాఖలు చేయడంతో ఆ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అబిషేక్ సంఘ్వీతో పాటు సీనియర్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు వేం నరేంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎంపికయ్యారు. సోమవారం రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అసెంబ్లీ లో రిటర్నింగ్ అధికారుల నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు....