నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో నిజామాబాద్ వెక్టార్ విద్యార్థులు ప్రతిభ చాటారు. వెక్టార్ విద్యాసంస్థకు చెందిన జి. గంగాదేవి (రోల్ నంబర్: 266182082) ఆల్ ఇండియా స్థాయిలో 1913వ ర్యాంకు సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా వెక్టార్ కళాశాల ఛైర్మన్ మధుసూదన్ జోషి మాట్లాడుతూ, గంగాదేవి సాధించిన ర్యాంకుతో ప్రముఖ భారతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఐఐటీ)లో సీటు సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు నిరంతర శ్రమ, ప్రణాళికాబద్ధమైన అధ్యయనం, నిబద్ధతతో కృషి చేయడం వల్లే ప్రతి ఏడాది వెక్టార్ విద్యాసంస్థ నుంచి పలువురు విద్యార్థులు దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశాలు పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు సంతోష్, కార్తిక్, గజానన్‌లు గంగాదేవిని అభినందించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
