26.8 C
Hyderabad

బయోటెక్నాలజీ విద్యార్థులను అభినందించిన వీసీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  బయోటెక్నాలజీ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థులు డబ్ల్యూ. ప్రత్యూష, ఎం. పవన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ నుండి సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ కు ఎంపిక కావడం అభినందనీయమని తెయూ వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి  పేర్కొన్నారు.  ప్రత్యూష  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ జీనం రీసెర్చ్ సెంటర్ న్యూఢిల్లీలో పరిశోధనలు చేయనున్నారని, పవన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో  పరిశోధనలు చేస్తారని విభాగాధిపతి డాక్టర్ ప్రసన్నశీల పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీసి బయోటెక్నాలజీ  విభాగాధిపతి డాక్టర్ ప్రసన్నశీలను, విద్యార్థినీ,విద్యార్థులను అభినందించారు.

More articles

Latest article