25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

స్వాతంత్య్ర పోరాటంలో ఉత్సాహం నింపిన గేయం వందేమాతరం

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్           

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో ఉత్సాహం  నింపిన గేయంగా వందేమాతరం చరిత్రలో నిలిచిపోయిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం 150 చోట్ల ఈ కార్యక్రమాన్ని పండగ లా చేయాలని నిర్ణయించిందని అన్నారు. 150 వ సంవత్సరాన్ని ఇలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సామూహికంగా వందేమాతర గీతాలాపన చేశారు. ఈనెల 26 వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయని  అన్నారు. అనంతరం నాయకులు, విద్యార్థులతో కలిసి స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ చైర్మన్, అధ్యక్ష కార్యదర్శులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Vande Mataram, the song that inspired the freedom struggle

Vande Mataram, the song that inspired the freedom struggle

More articles

Latest article