స్వాతంత్య్ర పోరాటంలో ఉత్సాహం నింపిన గేయం వందేమాతరం
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో ఉత్సాహం నింపిన గేయంగా వందేమాతరం చరిత్రలో నిలిచిపోయిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం 150 చోట్ల ఈ కార్యక్రమాన్ని పండగ లా చేయాలని నిర్ణయించిందని అన్నారు. 150 వ సంవత్సరాన్ని ఇలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు...