పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

0 14,545

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ కమిషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశానుసారoగా అదనపు డి.సి.పి (ఎ.ఆర్) కె.రామచంద్ర రావు  ఆద్వర్యంలో మహార్షి వాల్మీకి జయంతి కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి ఫోటోకు పుష్పగుచ్చాలు సమర్పించారు. అనంతరం అదనపు పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ శ్రీ మద్రామాయణ మహాకావ్య సృష్టికర్త  మహార్షి వాల్మీకి అని, ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా అడవిలో పెరిగి, సప్త ఋషుల బోధనల ద్వారా మహార్షి వాల్మీకిగా మారి అద్భుతమైన రామాయణం గ్రంథాన్ని మనకు అందించిన మహానీయుడు అని తెలిపారు. అందరమూ ఆయనను స్మరించుకోవలసిన అవసరం ఉందని, ఆదర్శవంతమైన జీవితం గడపడంతో పాటు సమాజ శ్రేయస్సుకు అవసరమైన జీవన సూత్రాలను, రామాయణం ద్వారా వాల్మీకి బోధించారని తెలియజేశారు. ఈ జయంతి సందర్భంగా ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్ అహ్మద్, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ లు శ్రీనివాస్, తిరుపతి, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వీరయ్య,  పోలీస్ కార్యాలయం సిబ్బంది,సి.సి.ఆర్.బి, సి.ఎస్.బి, ఐ.టి కోర్ , పోలీస్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.