28.8 C
Hyderabad
Monday, August 3, 2026

వైశ్యులు కేవలం లక్ష్మీ పుత్రులే కాదు.. సరస్వతీపుత్రులని నిరూపించారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వైశ్య ప్రతిభా పురస్కార కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

 

వైశ్యులు అంటే లక్ష్మీ పుత్రులే కాదని సరస్వతీ పుత్రులు కూడా ఉంటారని, ఇటీవల వెలువడిన పరిక్ష ఫలితాలలో వైశ్య విద్యార్ధులు నిరుపించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. పదో తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని, పేద విద్యార్థులకు తమ ట్రస్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని లక్ష్మీ కళ్యాణం మండపంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

 

Vaishyas are not just the sons of Lakshmi, they are also the sons of Saraswati.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ధన్ పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటికే అనేకమంది పేద విద్యార్థులకు విద్యను అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి కూడా భవిష్యత్తులో తన సహకారం ఉంటుందన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల విద్యార్థులు మరింత ఉత్తమంగా రాణించే అవకాశం ఉంటుందన్నారు. జీవితంలో ఏదైనా దోచుకునే అవకాశం ఉంటుంది కానీ.. విద్యను ఎవరూ దోచుకోలేరన్నారు.

 

Vaishyas are not just the sons of Lakshmi, they are also the sons of Saraswati.

 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు పోల విఠల్ రావు గుప్తా గారు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.విద్య అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. తాను కూడా మాక్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని సివిల్ ఇంజనీర్‌గా ఎదిగి, అనంతరం వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా పదేళ్లు సేవ చేసే అవకాశం దక్కిందన్నారు.గత 25 సంవత్సరాలుగా తమ కుటుంబం మాక్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. వైశ్య సమాజానికి సేవా దృక్పథం సహజసిద్ధమని, అదే భావంతో తమ కుటుంబ సభ్యులు చదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉండటాన్ని చూసి బాధపడ్డానన్నారు. తమ తాత బిగాల గంగారం పేరుపై ప్రైమరీ స్కూల్, తండ్రి బిగాల కృష్ణమూర్తి పేరుపై హై స్కూల్ నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, , ఆగీర్ వెంకటేష్,రేణుకుంట గణేష్, ఇరుకుల రామకృష్ణ,చింతల రవికుమార్,మోటూరి మురళి,పోల సుధాకర్,మంకాళి విజయ్, బచ్చు రామ్, బచ్చు అంజయ్య, చిదుర ప్రదీప్, నీల భాస్కర్,కందకుర్తి రామకృష్ణ,తాటి వీరేశం, చిదుర మాణిక్యం,గజవాడ హనుమంత్ రావు,కసుబ సంపత్,కాలభైరవ శ్రీనివాస్, గర్పల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Vaishyas are not just the sons of Lakshmi, they are also the sons of Saraswati.

More articles

Latest article