29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్రామీణ అభివృద్ధి కి విప్లవాత్మక మార్పు వి బి-రామ్-జి చట్టం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన వికసిత భారత్ – రోజ్ గార్ ఔర్ అజీవిక మిషన్ ( వి బి-రామ్-జి ) నూతన చట్టం గ్రామీణ అభివృద్ధిలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ పేర్కొన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి, సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నారు.గతంలో ఉన్న మహత్మగాంధి నరేగా పథకం కింద 100 రోజులు మాత్రమే పని కల్పించారు, కానీ ఈ నూతన చట్టం ద్వారా 125 రోజుల ఉపాధి లభిస్తుందని కోత్త చట్టం వల్ల గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమే అన్నారు. పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే వారికి నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధనను ఈ చట్టంలో మరింత బలోపేతం చేశారు.గతంలో వేతనాల చెల్లింపులో జాప్యం జరిగింది, కానీ ఇప్పుడు ప్రతి వారం నేరుగా కూలీల ఖాతాల్లోకి వేతనాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ వేతనాలు సరైన సమయానికి చెల్లించకపోతే, అదనపు పరిహారం (పరిహారం) చెల్లించే వెసులుబాటు కూడా ఈ చట్టంలో చేర్చారు అని గుర్తు చేశారు. వ్యవసాయ సీజన్లో కూలీల కొరత రాకుండా, విత్తనాలు, నాట్లు పంటకోత సమయాల్లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు అని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ,గ్రామ సభలు స్వయంగా తమ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం ఉందని గతంలో ఆ అవకాశం లేదన్నారు. ఈ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆధారిత పనులు ,విపత్తు నిర్వహణ వంటి నాలుగు రకాల పనులు చేపట్టనున్నారు. ఇందులో చెరువు, చెక్ డ్యామ్ , పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, కాలువలు వంటి నిర్మాణాలు పాటు, మహిళా స్వయం సహాయక బృందాల ఆదాయాన్ని పెంచే పనులు కూడా చేర్చారు. ఆధార్ ,బయోమెట్రిక్ అనుసంధానం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడం తో పాటు, ఎప్పటికప్పుడు సామాజిక తనిఖీలు చేపట్టడం జరుగుతుంది కోత్త చట్టంలో మార్పులతో గ్రామీణ పేదలకు ఉపాధి పెంచారు కానీ తగ్గించ లేదన్నారు. ప్రతిపక్షాలు రాజకీయంలోకి ఉపాధి హామీ పథకం ను లాగుతున్నారని ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కార్ లక్ష్మీనారాయణ, నాగోల్ లక్ష్మీనారాయణ, నాయకులు ప్రమోద్, జ్యోతి, బద్దం కిసాన్, వీరేందర్, ఓం సింగ్, ఇప్ప కాయల కిషోర్, తారక్ వేణు, మాస్టర్ శంకర్, బుర్గుల వినోద్, ఆమందు విజయ్ కృష్ణ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

V-B-RAM-G Act, a revolutionary change for rural development

More articles

Latest article