25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్, బతుకమ్మ :

 

ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శెట్ పల్లి గ్రామ సర్పంచ్ గ్రామస్తులకు సూచించారు. లింగంపేట్ మండలం శెట్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను గ్రామస్తులకు వివరించారు. దీంతో గ్రామస్తులు గ్రామ అభివృద్ధికి ప్లాస్టిక్ నిషేధానికి సహకరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మన్నే బాలయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు, కిరాణా కొట్టు యజమానులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article