24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నఅర్బన్ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నగరంలోని 22, 23 డివిజన్లో సీసీ రోడ్ బీటీ రోడ్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతు కిరణ్ లు సోమవారం పాల్గొని భూమిపూజ చేశారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు 23వ డివిజన్ కు స్పెషల్ ఫండ్ రూ.11.5 లక్షలు, జనరల్ ఫండ్ రూ.10 లక్షలు, పట్టణ ప్రగతి ద్వా రూ.10 లక్షల నిధులతో హనుమాన్ నగర్, పద్మనగర్ లో సీసీ రోడ్, బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిపై ప్రతేక దృష్టి పెట్టాలని నగర అభివృద్ధికి & సుందరికరణకు స్పెషల్ ఫండ్ 100 కోట్ల నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు, రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ బకాయి నిధులు చెల్లించి, నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని సూచించారు. 23, 24 డివిజన్ ను కలిపే రోడ్ నిర్మాణానికి విశ్వశాంతి యాజమాన్యం రోజరాణి 300 గజాలు ఉచితంగా ఇవ్వడం సంతోషం అని నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అయినా విశ్వశాంతి యాజమాన్యాన్ని అభినందించారు. అలాగే 22వ డివిజన్లో మహాలక్ష్మి నగర్ లో జనరల్ ఫండ్ 10 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణాపనులకు కూడా భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 23, 22వ డివిజన్ కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, పంచారెడ్డి లావణ్య ప్రభాకర్, ఎర్రగుంట లక్ష్మణ్, హరీష్ రెడ్డి,కైరంకొండ మురళి, హరీష్, దర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

Urban MLA involved in development programs

More articles

Latest article