28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో జనగణన పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులు స్వీయ నమోదు వివరాలు, ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలని స్వీయ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎటువంటి అపోహలకు గురికాకుండా ప్రభుత్వ అధికారిక పోర్టల్ లో తమ వివరాలను పొందుపరచాలన్నారు. అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తారని, అలాగే ప్రజలు కూడా స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్, తహసిల్దార్ బాలరాజు, టిపిఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article